VZM: జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడలో ‘ఆవకాయ్ అమరావతి ఉత్సవ్’ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు సాహితీ స్రవంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయలు మురళీకృష్ణకు ఆహ్వానం అందింది. ఆయన ఇప్పటివరకు మూడు కవిత సంపుటలు వెలువరించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి నాయకులు ఆయనను అభినందించారు.