VKB: జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.