W.G: పెనుగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో పార్కులో అదృశ్యమైన బాలుడు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఇవాళ రాత్రి చోటుచేసుకుంది. 10 ఏళ్ల వయసు కలిగిన బాలుడు మృతదేహాన్ని స్థానికులు చెరువులో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గురువారం మధ్యాహ్నం పార్కులో ఆడుకుంటూ ఉండగా అదృశ్యమయ్యాడు. అప్పటినుంచి స్థానికులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.