కోనసీమ: అంబాజీపేట మండలం మాచవరంలో ప్రధాన రహదారిపై గురువారం కారు, ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ బాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్కి చెందిన జయప్రకాష్ కోనసీమ పర్యటనకు వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టి, రోడ్డు పక్కన ఉన్న మరో కారును ఢీకొందని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.