AKP: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కోటవురట్ల మండలంలో ఈనెల 26వ తేదీన జరగాల్సిన గ్రామసభలు వాయిదా పడినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీజీ-జీసీ రామ్ జీ పథకంగా కేంద్రం మార్పు చేసింది. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలోనూ గ్రామసభల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.