JN: బచ్చన్నపేట మండల కేంద్రంలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బచ్చన్నపేట రెవెన్యూ కార్యాలయంలో కట్కూర్ జీపీవోగా విధులు నిర్వహిస్తున్న నరసయ్య తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. నరసయ్య మరణ వార్త తెలుసుకున్న మండల అధికారులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.