బంగ్లాదేశ్లో హిందూ యువకుడి దారుణ హత్యపై నటి జాన్వీ కపూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి ఘటనలు అనాగరికమని, ఇది హత్య కాదు.. ఊచకోత అని మండిపడింది. ప్రపంచంలో ఎక్కడో జరిగే వాటిపై ఏడుస్తూ.. మన పక్కనే సొంత మనుషులు తగలబడిపోతుంటే మౌనంగా ఉండటం సరికాదని చెప్పింది. ఈ ద్వంద్వ వైఖరి మనల్ని నాశనం చేస్తుందని, మతతత్వ దాడులపై ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని పిలుపునిచ్చింది.