BHPL: కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జక్కు వీరయ్య బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కాగా వెంటనే కుటుంబ సభ్యులు హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ వీరయ్య ఇవాళ సాయంత్రం మృతి చెందారు. ఆయన మరణానికి పలువురు అధికారులు సంతాపం తెలిపారు.