VZM: బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి చీకటి మానవేంద్ర రాయ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన స్వయంగా ఆహ్వానించి, దగ్గరుండి ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి బబిత తదితరులు పాల్గొన్నారు.