అన్నమయ్య: రామసముద్రం నూతన ఎస్సైగా ఉమామహేశ్వర్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.