VZM: పలు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న పఠాన్ బాషా అలీ (31)పై కఠినమైన పిట్ ఎన్డిపిఎస్ చట్టం ప్రయోగించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో 4 గంజాయి కేసుల్లో అరెస్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్భంద ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. గురువారం అతడిని నిర్భందించి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించినట్లు వెల్లడించారు.