మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి నేషనల్ హైవే 44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఇవాళ పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి ఆసుపత్రిలో విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు సూచించారు.