కోనసీమ: ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామాన్ని ఎన్నారై దత్తత తీసుకున్నారని ఆ గ్రామ సర్పంచ్ మార్గాని కరుణ ఏసు, గ్రామ పెద్దలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్నారై సౌజన్యంతో సమకూర్చిన డస్ట్ బిన్లను గ్రామ వీధుల్లో ఏర్పాటు చేశారు. దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ.. ఒక డస్ట్ బిన్ సుమారు 4,500 రూపాయలు విలువ చేస్తుందన్నారు. ఇలాంటివి 30ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.