VSP: క్రిస్మస్ సెలవు సందర్భంగా గురువారం ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరిగింది. సాగర్‌నగర్ బీచ్, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, బావికొండ, తోట్లకొండ, మంగమారిపేట బీచ్, ఎర్రమట్టిదిబ్బలు, భీమిలి బీచ్ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబాలతో పర్యాటకులు సందడి చేశారు.