వరంగల్ నగరంలోని చింతల్లో ఉన్న 36వ డివిజన్ వార్డు కార్యాలయంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా సుల్తానా మసూద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆమె కేక్ కట్ చేసి నగర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులకు స్వెట్టర్లను పంపిణీ చేశారు.