BPT: ఆటోలలో ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకోకూడదని కారంచేడు ఎస్సై ఖాదర్ బాషా సూచించారు. జాతీయ రహదారి 167(ఏ)పై వాహన తనిఖీలలో భాగంగా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పొలాలకు వెళ్లే కూలీలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పరిమితికి మించి ఆటో ఎక్కకూడదని హెచ్చరించారు.