ADB: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌ను గురువారం ఆదివాసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 30వ తేదీన అసిఫాబాదులోని కోట పరందోళిలో జరగనున్న జంగుబాయి ఉత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మహాపూజకు ఆయన్ను ఆహ్వానించారు. కలిసిన వారిలో జంగుబాయి ఉత్సవ కమిటీ ఛైర్మన్ సలాం శ్యామ్ రావు, జాకు, బాపూరావు, తదితరులు ఉన్నారు.