BHNG: పాల బిల్లుల చెల్లింపులో మదర్ డైరీ పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందిందని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ వారు వెంటనే రాజీనామా చేయాలని ఆలేరు పాలకేంద్రం పరిధిలోని సొసైటీ ఛైర్మన్లు, పాడి రైతులు డిమాండ్ చేశారు. గురువారం ఆలేరు పాల కేంద్రంలో పాల ట్యాంకర్ను అడ్డుకొని వారు నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా నాయకులు ఎక్బాల్ సంఘీభావం తెలిపారు.