VZM: ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో గురువారం డ్రోన్ సర్వే నిర్వహించారు. డ్రోన్ సర్వే ద్వారా ఎస్.కోట నుండి శివారామరాజుపేట వెళ్లే దారిలో మద్యం సేవిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. అలాగే మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని పట్టుకొని అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశామన్నారు.