AKP: పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీకి చెందిన క్రీడాకారుడు గండి శివాజీ అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు కానున్న నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కూండ్రపు మధు ఆధ్వర్యంలో రూ.50,000 సేకరించి క్రీడాకారుడికి అందజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.