MHBD: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో ఇవాళ BRS ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈ నెల 27న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పోరాట పటిమతో గెలిచిన సర్పంచ్లను కేటీఆర్ స్వయంగా కలిసి అభినందిస్తారని పేర్కొన్నారు.