నారాయణపేట జిల్లా కేంద్రంలో యాదగిరి రోడ్డులో గల ఎం.బి చర్చ్‌లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 500 మంది ప్రజానికం పాల్గొన్నారు. వారందరూ తమ ఆటపాటలతో క్రీస్తు యేసును మనసార స్మరించుకున్నారు. పాస్టర్ మాట్లాడుతూ.. క్రిస్మస్ అంటే నిత్య ఆనందమని ప్రసంగించారు. ముగింపులో క్రీస్తు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.