MNCL: ఈనెల 27న సింగరేణి గుర్తింపు సంఘం రెండేళ్ళ కాల పరిమితి ముగిస్తున్నందున తిరిగి ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు కే. విశ్వనాథ్, వై. యాకయ్య గురువారం డీసీఎల్సీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికలు నిర్వహించే వరకు కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు అన్ని సంఘాలకు అవకాశం ఇవ్వాలన్నారు.