జగిత్యాల నియోజకవర్గంలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్, గోవింద్ పల్లె, ధరూర్ క్యాంప్, రాయికల్ మండలంలోని కుమ్మర్ పల్లె గ్రామంలలోని పలు చర్చ్‌లలో ఆయన సందర్శించి, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.