NTR: వీరులపాడు మండలం జుజ్జారులో వరి కోతల అనంతరం రైతులు పంట వ్యర్థాలను పెద్ద ఎత్తున కాల్చివేస్తున్నారు. ఈ చర్య వల్ల భూమిలోని సూక్ష్మజీవులు నశించి, భూసారం తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలిపి దున్నడం వల్ల ఎరువుగా మారుతుందని విజ్ఞప్తి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు.