ప్రకాశం: మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాపట్ల పీడీని నియమించారు. ఆయనపై దాదాపు రూ. 10 కోట్లు బోగస్ సంఘాలకు రుణాలుగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మెప్మాలో అవినీతి జరిగిందంటూ గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సైతం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.