NLR: మర్రిపాడు మండలం నెల్లూరు-ముంబై హైవేపై గంగుంట వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైక్ బోల్తా పడటంతో దానిపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు మర్రిపాడు 108 సిబ్బంది స్పందించి, క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.