ఇండిగో సిబ్బందిపై నటుడు నరేష్ విమర్శలు గుప్పించాడు. బస్సు నిండిపోయినా ఇంకా ప్రయాణికులను ఎక్కించిందని, వారి ఇబ్బందులను సిబ్బంది పట్టించుకోవడం లేదని ఫైరయ్యాడు. విమానం దగ్గరికి తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా కుక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండిగో తీరుపై న్యాయం పోరాటం చేస్తానని, లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ట్వీట్ చేశాడు.