MBNR: బాలానగర్ మండలంలోని నామ్య తండా ఉపసర్పంచ్ హర్యానాయక్ బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సీనియర్ నాయకుడు చించోడు అభిమన్యు రెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా గెలిచిన హర్యానాయక్ ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గణేష్ గౌడ్, రాజేందర్, గోపీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.