NZB: కోటగిరి, రుద్రూర్ మండలాలకు చెందిన 108 అంబులెన్స్‌లను జీవీకే ఈఎంఆర్ఐ ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లలోని మందుల నిల్వలు, రికార్డులు, వైద్య పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన అత్యవసర సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ పాల్గొన్నారు.