దిత్వా తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ సుమారు రూ.4 వేల కోట్ల సాయం ప్రకటించింది. శ్రీలంక పునర్నిర్మాణానికి స్థిరమైన నిబద్ధతతో భారత్ ఉందని విదేశాంగమంత్రి జైశంకర్ తెలిపారు. ప్రధాని మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా శ్రీలంకకు వెళ్లిన ఆయన.. అక్కడి అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఆర్థిక సాయంపై ప్రధాని మోదీ రాసిన లేఖను శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకెకు అందించారు.