MNCL: విద్యాశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని జెడ్పీ బాలుర పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వంటల పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 10 మండలాల నుంచి మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొని పోటీ పడి మెనూ ప్రకారం రుచికరంగా వంటలు చేశారు. అనంతరం విజేతలకు డీఈఓ యాదయ్య నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.