GNTR: రానున్న సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఆప్కో షో రూమ్లో భారీ డిస్కౌంట్ అమ్మకాలు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో చేనేత, జౌళి శాఖాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మెగా క్లస్టర్ల ఏర్పాటు, గడిచిన మూడు నెలల్లో ఆప్కో అమ్మకాలపై మంత్రి ఈ సందర్భంగా ఆరా తీశారు.