ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం గూడేవారిపాలెంలో మంగళవారం డీపీవో వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం డీపీవో మాట్లాడుతూ.. జల సురక్ష మాసం కార్యక్రమంలో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంకులను పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు.