BHPL: చిట్యాల మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ వైన్స్ కారణంగా జూనియర్ కాలేజీ విద్యార్థులు మద్యపానానికి బానిసలవుతున్నారని ఆరోపిస్తూ ఇవాళ టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, వీసీకే యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. వైన్ షాపులను ఊరి దూరంగా తరలించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.