MDK: జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావుకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఎస్పీని పోలీస్ ప్రధాన కార్యాలయంలో పలువురు అధికారులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, ప్రసన్న కుమార్ ఉన్నారు.