AP: రెడ్ బుక్‌లో ఎన్ని పేజీలు ఉన్నాయో లోకేష్‌కు తెలుసా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘రెడ్ బుక్‌ను మా కుక్క కూడా లెక్క చేయదన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని పవన్‌కు భయం. అందుకే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబును పవన్ కాపు కాస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో పవన్‌కు వాటా ఉంది’ అని ఆరోపించారు.