SS: సోమందేపల్లి మేజర్ పంచాయతీలో వైసీపీ కార్యకర్తలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డు స్థాయిలో ప్రతి కార్యకర్తను గుర్తించి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మడకశిర వైసీపీ సమన్వయకర్త ఈరలకప్ప, తదితరులు పాల్గొన్నారు.