NDL: ఆళ్లగడ్డలోని కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో టౌన్ సీఐ యుగంధర్ విద్యార్థులకు డ్రగ్స్ గురించి మంగళవారం అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.