AP: ఈనెల 25న అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ కాంస్య విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ క్రమంలో వెంకటపాలెంలో విగ్రహ ఏర్పాట్లను బీజేపీ చీఫ్ మాధవ్ పరిశీలించారు. 14 అడుగుల ఎత్తులో వాజ్‌పేయ్ విగ్రహం ఏర్పాటు కానుంది. అందరికీ స్ఫూర్తినిచ్చేలా విగ్రహం ఉంటుందని మాధవ్ తెలిపారు.