TPT: తొట్టంబేడు మండలం పెద్దకన్నలి వద్ద సోమవారం ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు శ్రీకాళహస్తి నుంచి కన్నలి వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న 7 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా.. ప్రవళిక అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.