ADB: తెలంగాణ రాష్ట్రానికి శీతాకాల విడిది నిమిత్తం విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం బొల్లారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.