GNTR: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు DMHO విజయలక్ష్మి హెచ్చరించారు. PHC తనిఖీలలో భాగంగా శుక్రవారం రాత్రి పెదకాకాని మండలం వెనిగండ్ల PHCని తనిఖీ చేయగా తాళం వేసి ఉందని, విధులు నిర్వహించాల్సిన మెడికల్ అధికారి, స్టాఫ్ నర్సు లేకపోవడంపై DMHO ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గైర్హాజరైన వారికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.