ATP: తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో అవసరమని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఈ టీకా వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలన కోసం శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు.