KMM: జిల్లాలోని నాచారం వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వెళ్లే భక్తులకు ఇక ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. నాచారం ఒంటిగుడిసె నుంచి జూలూరుపాడు వరకు రహదారి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 43 కోట్లు మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఈ నిధులకు సంబంధించి పరిపాలన అనుమతులు లభించాయి. R&B ఆధ్వర్యంలో ఈ రహదారిని త్వరలోనే వెడల్పు చేయనున్నారు.