VZM: గంట్యాడ మండలంలో ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్దానిక MPDO ఆర్వీ రమణమూర్తి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 0-5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు, సచివాలయాలకు తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.