పర్యావరణ ఉద్యమనేత సుందర్ లాల్ బహుగుణ ఉత్తరాంచల్‌లోని మరోరాలో 1927లో జన్మించారు. ఆచార్య వినోబాబావే పిలుపు మేరకు ఆయన సామాజిక సేవపై దృష్టి సారించారు. తన సతీమణి విమలతో కలిసి సారా నిషేధ ఉద్యమం చేపట్టారు. అలాగే, అడువులను నరికివేయకుండా ‘చిప్కో’ ఉద్యమానికి నాయకత్వం వహించారు. నదులు, అడువులు, కొండలు మన జీవతం అని బోధించారు. ‘భారతదేశపు పర్యావరణ స్వరం’గా గుర్తింపు పొందారు.