కృష్ణా: పర్యాటక రంగానికి కొత్త కళ తెచ్చేలా కృష్ణా నదిలో లగ్జరీ హౌస్ బోట్లను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు 20 కి.మీ మేర ఈ బోట్లు ప్రయాణిస్తాయి. ఏసీ, అత్యాధునిక బెడ్ రూముల డైనింగ్ హాల్ వంటి సౌకర్యాలతో పర్యాటకులకు కేరళ అనుభూతిని అందించనున్నాయి. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పర్యాటక శాఖ వెల్లడించింది.