టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒక టీ20 క్యాలెండర్ ఇయర్లో 1600 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్.. 21 మ్యాచుల్లో 859 రన్స్ చేశాడు. మొత్తంగా 2025లో టీ20ల్లో 1602 పరుగులు పూర్తి చేసి కోహ్లీ ఆల్టైమ్ రికార్డును సమం చేసేందుకు 12 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కోహ్లీ 2016లో IPL, భారత్ తరఫున 1614 పరుగులు చేశాడు.