ATP: గుత్తి మున్సిపాలిటీలోని జగనన్న కాలనీలో కంపోస్టు యార్డ్ వద్దని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ఇవాళ సాయంత్రం జగనన్న కాలనీలో నిరసనలు తెలిపారు. కాలనీవాసులు రఘునాథరెడ్డి, కోమల మాట్లాడుతూ.. కాలనీలో కంపోస్ట్ యాడ్ పెడితే కాలనీవాసులు రోగాల బారిన పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించాలని, వారు కోరుతున్నారు.